- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్.. వారికి మాస్ వార్నింగ్
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/చిన్నచింతకుంట: తరాలుగా నిర్లక్ష్యానికి గురై.. వలసల జిల్లాగా ఉన్న పాలమూరు(Palamuru)ను అన్ని విధాల అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం దొరికింది.. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిగులుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామం సమీపంలో ఉన్న కురుమూర్తి స్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, అన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తదితరులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి, ఇతర రోడ్డు నిర్మాణాలకు, సెంట్రల్ లైటింగ్, డ్రాయింగ్స్, పార్కింగ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. 2009లో వలస వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు గెలిపించినందుకే తెలంగాణ ఉద్యమం చేశారు. రెండుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు.. పరిశ్రమలు రాలేదు. ఈ కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వలసలు ఆగలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు మా జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని దక్కించుకోవడంతో పాటు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మాకు దక్కింది. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటే మా కాళ్ళల్లో కట్టెలు బెట్టే కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. పాలమూరు అభివృద్ధిని గురించి ఎవ్వరు ఆటంకాలు కలిగించిన మా ప్రజల చమటల్లో కొట్టుకుపోతారు.. ఇక్కడి యువత మీకు ఎలా గుణపాఠం చెప్పాలో అలా చెబుతారు అని పేర్కొన్నారు. నా మీద కోపం ఉంటే.. నన్ను సాధించండి అంతేకానీ మా జిల్లా జోలికి వస్తే ఊరుకునేది లేదు అని ఆయన హెచ్చరించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాను కృష్ణమ్మ జలాలతో తడుపుతాం.. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పూర్తిచేసి ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి, మన్యంకొండ దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.. జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్లు వేసి తీరుతాం అన్నారు.అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి నివేదికను అందజేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.