- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్ఎల్బీసీ ఘటనపై నిరంతరం సమీక్షిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : శ్రీశైలం లెప్ట్బ్యాంక్ కెనాల్(ఎస్ఎల్ బీసీ) ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిందని తెలిసినప్పటి నుంచి సంబంధింత శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, సహాయక బృందాలు, సహాయక చర్యలను తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి పలుమార్లు మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెండో రోజు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగాయి.
ఈ సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండీ పర్యవేక్షించారు. ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వాటర్ ప్లోటింగ్ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, నిరంతరం నీటిని బయటకు తోడేయటంతో పాటు సొరంగంలోనికి ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టన్నెల్ లో కూలిన మట్టి దిబ్బలను తొలగించి ప్రమాదం జరిగిన చోటికి చేరుకునే ప్రత్నామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.