- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్వాడీలపై CM రేవంత్ రెడ్డి ఫోకస్.. CC కెమెరాలు పెట్టాలని ఆదేశం
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మాతా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేగాకుండా.. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలపై అధ్యయనం చేయాలని తెలిపారు.
Advertisement
Next Story