- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
CM Revanth Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో.. ప్రజలకు గొప్ప అనుభవాలే ఉన్నాయ్: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఎదురుదాడి
దిశ, వెబ్‌డెస్క్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గొప్ప అనుభవాలే మిగిలాయని సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభను తప్పుదోవ పట్టించేందుకు కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళిలను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారి పాలనా అనుభవాలతో ప్రజలకు కాంగ్రెస్ అధికారం కట్టబెట్టారని సెటైర్లు వేశారు. పది నెలలు కూడా పూర్తి కాని తమ ప్రభుత్వం విపక్షాలు వందల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూరత్ నుంచి చీరలు తీసుకొచ్చి నిరుపేదలను మోసం చేసింది నిజం కాదా అని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌ను నిర్మిస్తున్నామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రేపు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ముచ్చర్లలో సాయంత్రం 4 గంటలకు స్కిల్ వర్సిటీ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆ కార్యక్రమంలో విపక్ష సభ్యులు కూడా పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌గా ఆహ్వానించారు.