సీఎం ఐతే రేవంతన్న మారిపోవాలా..? పది రూపాయల జ్యూస్ తాగుతున్న సీఎం..

by Ramesh N |   ( Updated:2024-02-03 12:40:55.0  )
సీఎం ఐతే రేవంతన్న మారిపోవాలా..? పది రూపాయల జ్యూస్ తాగుతున్న సీఎం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పాపులర్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి జోష్ మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల కోసం అదే ఊపుతో పనిచేస్తున్నారు. ఇటీవల మాజీ కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ సమయంలో పరామర్శకు సీఎం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆసుపత్రి వద్ద ‘రేవంతన్న’ అని ఓ మహిళ పిలిచినప్పుడు ఒక సాధారణ వ్యక్తిలా తన దగ్గరికి వెళ్లి ఆమె సమస్య విని అధికారులకు ఆదేశాలిస్తారు. దీనికి సంబంధించిన వీడియో గతంలో వైరల్ అయ్యింది.

‘రియల్’ జ్యూస్ డ్రింక్ తాగుతున్న ఫోటో వైరల్

తాజాగా లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభ నుంచి స్టార్ట్ చేశారు. ఈ కమ్రంలోనే ఆయన ఇంద్రవెల్లికి ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి ‘రియల్’ జ్యూస్ డ్రింక్ తాగుతున్న ఫోటోపై ఆయన అభిమానులు, శ్రేణులు వారి వారి అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు.

సీఎం ఐతే రేవంతన్న మారిపోవాలా?

‘సీఎం కాలు మడిచి మోటుగా కూర్చోవడం ఏమిటి, రూ.10 ‘రియల్’ జూస్ తాగడం ఏంటని అనిపించవచ్చు. కానీ, రొటీన్‌కు భిన్నంగా కొంచం డిఫరెంట్‌గా చూస్తే ఆయనలోని ‘సామాన్యుడు’ కనిపిస్తాడు. సీఎం ఐతే రేవంతన్న మారిపోవాలా? తన ఒరిజినాలిటీ వదిలేయాలా? తను తనలాగే ఉన్నందుకే కదా.. తెలంగాణ తనను ఇష్టపడింది. అందుకే ప్రతిపక్ష నేత అయినా.. ముఖ్యమంత్రి అయినా రేవంతన్న ఎప్పటికీ రేవంతన్నే’ అని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

బీజేపీలోకి NTV చైర్మన్ నరేంద్ర చౌదరి..?

Advertisement

Next Story

Most Viewed