- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth Reddy: ‘ప్రధాని అబద్ధాలు చెప్పడం మానుకోవాలి’
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ రోజు(శనివారం) ముంబై చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక కాంగ్రెస్ నేతలను కలిసిన ఆయన.. అక్కడి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే దానిపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. మహారాష్ట్ర బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలోని తమ ప్రభుత్వంపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని విమర్శించారు.
‘‘దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చిన మోడీ అదానీ, అంబానీలకు మేలు చేయాలని అనుకున్నారు. ఇక తెలంగాణలో తమ ఆరు గ్యారెంటీల అమలు విషయానికి వస్తే.. మా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతుల విషయంలో మోడీ విమర్శలకు సరైన సమాధానం ఇచ్చాం. దాంతో ఆయన తన ట్వీట్‌ను కూడా డిలీట్ చేసుకున్నారు. ఇకనైనా ఆయన అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. ఆయన అబద్ధాలు చెబుతున్నా.. తాము నిజాలు చెబుతూనే ఉంటాం.’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మహారాష్ట్రలో అబద్ధాలు ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2024
వరి కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామని అంటున్న రేవంత్ రెడ్డి.
కానీ సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పి.. తేమ శాతం అంటూ కారణాలు చూపుతూ ఆ వడ్లను కూడా కొనని ప్రభుత్వం. pic.twitter.com/dopg1QavER