- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బీజేపీ, ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి శనివారం మెదక్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.. పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పవర్‌లో ఉంది.. కానీ ఇద్దరూ కలిసి మెదక్‌కి చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జెండా, అజెండా మార్చినా రెండు తోడు దొంగల పార్టీలే అని విమర్శించారు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడీ నిరుద్యోగులను మోసం చేశారని ఫైర్ అయ్యారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు.. ఒక్క రూపాయైన వేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో రైతులను చంపిన బీజేపీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పేదలకు ఎప్పుడు అండగా నిలబడేది మూడు రంగుల జెండానే అని అన్నారు. మోడీ, కేసీఆర్ ఎప్పుడూ మెదక్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మెదక్ అభివృద్ధికి ఏం చేశారో చెప్పి హరీష్ రావు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
Read More...
పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రా.. సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ చాలెంజ్