- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: మూసీ సుందరీకరణకు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణకు సహకరించాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర సుందరీకరణ లో భాగంగా.. చేస్తున్న మూసీ ప్రక్షాళనకు రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని సీఎం సందర్భంగా మంత్రిని కోరారు. అలాగే గోదావరి జలాలను జంట జలాశయాల్లో కలిపే పనులకు సహాయం చేయాలని, జంట జలాశయాల పనులకు రూ. 6 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నేటికి 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లేదని, వాటి కోసం రూ. 16,100 కోట్లు ఇవ్వాలని సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి ని కోరారు. ఈ భేటీలో సీఎం తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.