తెలంగాణలో ఇక పీపుల్స్ గవర్నమెంట్.. ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

by Nagaya |   ( Updated:2023-12-07 08:37:20.0  )
తెలంగాణలో ఇక పీపుల్స్ గవర్నమెంట్.. ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే మొదలు రేవంత్‌రెడ్డి వరకు అందరూ ప్రజా తెలంగాణ, ప్రజా ప్రభుత్వం, ప్రజల పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. దొరల తెలంగాణ స్థానంలో ప్రజల తెలంగాణ ఆవిష్కృతమవుతుందని ప్రజలకు స్పష్టంగా తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఆశించినట్లుగానే ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టం కట్టారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, మరో పది మంది మంత్రులుగా (ఇందులో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా) ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ వేదిక మీద తెలంగాణ పీపుల్స్ గవర్నమెంట్ (తెలంగాణ ప్రజా ప్రభుత్వం) అని పేర్కొనడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ళ పాటు దొరల తెలంగాణ పరిపాలన కొనసాగిందని, ఇకపైన ప్రజల తెలంగాణగా ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ఈ స్లోగన్ ద్వారా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed