HYD: కమ్యూనిస్టు నేతలకు సీఎం రేవంత్ కీలక హామీ

by Gantepaka Srikanth |
HYD: కమ్యూనిస్టు నేతలకు సీఎం రేవంత్ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Kunamneni Sambasiva Rao) కలిశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై చర్చించారు. కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని, కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

తన సొంత నియోజకవర్గ ప్రజలను తానెందుకు ఇబ్బంది పెడతానని, కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని, తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అనంతరం వామపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనపై నిజమైన కుట్ర దారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, జైల్లో ఉన్న రైతులను విడుదల చేయాలని కోరారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed