- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమైతే.. దమ్ముంటే చర్చకు రండి : కేసీఆర్, హరీష్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమే అయితే.. దమ్ముంటే చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఇవాళ హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మామ, అల్లుడు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారని ఫైర్ అయ్యారు. నిన్న ఓ టీవీ స్టూడియోలో నాలుగు గంటల పాటు కూర్చుకున్నాడు కానీ, అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్‌ను కేసీఆర్ మందేసి గాశాడో.. మరి దిగిపోయాక గిశాడో కానీ అది కాస్త కూలిపోయిందని అన్నారు.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమే అయితే.. వెంటనే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నానని అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానన్న హరీష్ రావు కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు. హరీశ్‌రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండు అంటూ సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి హరీశ్ సంగతి తెలుస్తానని అన్నారు. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టె దొరకలేదా హరీష్ అంటూ ఎద్దేవా చేశారు.