CM Revanth: విపత్కర పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేశాం: సీఎం రేవంత్‌‌ రెడ్డి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు

by Shiva |
CM Revanth: విపత్కర పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేశాం: సీఎం రేవంత్‌‌ రెడ్డి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీతో తమ జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ చేశామని తెలిపారు. రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలన్నింటిని మాఫీ అయ్యాయని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో రైతులందరి ఇళ్లలో పండుగ రోజు అని అన్నారు. రైతు ప్రయోజనాలే తమ ప్రభుత్వం విధానమని స్పష్టం చేశారు.

కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్ల కాలంలో బడా కార్పొరేట్ సంస్థలు రూ.10 లక్షల కోట్లను ఎగవేశాయని తెలిపారు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పుల తెచ్చి సాగు చేస్తున్నారని.. ఆ అప్పులు తీర్చలేక అనేక మంది అన్నదాతలు తమ సొంత పొలాల్లో పురుగుల మందు తాగి చనిపోతున్నారని పేర్కొన్నారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షభంలో కూరుకుపోకూడదనే తమ సర్కార్ విధానమని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం చేసిన రూ.లక్ష రుణమాఫీ వడ్డీ కట్టేందుకే సరిపోయిందని ఆవేద వ్యక్తం చేశారు. వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించామని తెలిపారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ చేయలేరంటూ విపక్షాలు తమను అవహేళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. రుణమాఫీ చేసి తీరాలని సహచరులతో చెప్పానని తెలిపారు. రైతు రుణమాఫీ తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, దేశ భద్రత, ఆహర భద్రతకు తమ పార్టీ మొదటి నుంచి ప్రముఖ్యత ఇచ్చిందన్నారు. ఆనాడు రైతుల కష్టాలు గుర్తించే నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లను రైతులకు పంచిన ఘటన కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటామని ఆరు గ్యారంటీల అమలుకు మంత్రులందరూ తనకు అండగా నిలబడ్డారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed