- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిరసనకు టీపీసీసీ చీఫ్ పిలుపు.. ఈడీ ఆఫీస్ ఎదుట భారీగా పోలీసుల మోహరింపు

దిశ, వెబ్‌డెస్క్: ‘నేషనల్ హెరాల్డ్’ (National Herald) మనీలాండరింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) సహా పలువురి పేర్లను ఈడీ చార్జీషీట్‌లో చేర్చింది. ఈ నేపథ్యంలోనే కేసులో ఈడీ (Enforcement Directorate) వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఈడీ (ED) కార్యాలయం భారీ నిరసనకు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. ఛార్జిషీట్లలో సోనియా, రాహుల్ పేర్లను కక్షపూరితంగా చేర్చారని ఆయన కామెంట్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకాబోతున్నారనే సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈడీ కార్యాలయం ఎదుట భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కార్యాలయం చుట్టూ పహారా కాస్తున్నారు.