- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైలును బోల్తా కొట్టించే కుట్ర? గరీబ్ రథ్‌కు తప్పిన ప్రమాదం.. ట్రాక్‌పై పెద్ద దుంగ, కొమ్మలు

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని నలుమూలల నుంచి రైలును బోల్తా కొట్టించేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే ట్రాక్‌పై రాళ్లు, పెద్ద చెట్ల కొమ్మలు ఉంచి వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా (Uttar Pradesh) ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో రైలు పట్టాలపై పెద్ద చెట్టు కొమ్మలు, పెద్ద దుంగను ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి దిలావర్ నగర్, రహీమాబాద్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు మామిడి చెట్టుకొమ్మలు, ఓ పెద్ద దుంగను శ్రీ రాముడి పేరుతో ఉన్న టవల్‌తో కప్పి ట్రాక్‌పై అడ్డంగా పెట్టిఉంచారు. ఇది గమనించిన కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ దాన్ని గుర్తించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అదే సమయంలో రావాల్సిన (Garib Rath Express) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మలిహాబాద్ స్టేషన్ వద్ద చాలా గంటలు నిలిపివేశారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. రహీమాబాద్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ట్రాక్ నుంచి 2.5 అడుగుల పొడవు, 6 అంగుళాల మందం కలిగిన దిమ్మ, చెట్టుకొమ్మలు, టవల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోని ఫోరెన్సిక్‌కు పంపించారు. గరీబ్ రథ్ రైలు పట్టాలు తప్పడానికి పెద్ద కుట్ర జరిగిందని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. రైల్వే ట్రాక్‌పై వాటిని ఎవరు తీసుకొచ్చారో తెలుసుకునేందుకు పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైలును బోల్తా కొట్టేంచే కుట్రలో భాగంగానే దుండగులు ఇలా చేస్తున్నారని, గతంలో జరిగిన ఇలాంటి సంఘటలను నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.