- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Katipalli: సీఎం రేవంత్ తీరు ప్రజలకు ఉపయోగపడేలా లేదు: బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడేలా లేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పేర్కొన్నారు. 9 రోజులుగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీగా సాగిందని మండిపడ్డారు. ఏదో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పెట్టారని ఎద్దేవా చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి గత ప్రభుత్వం పై దుమ్మెత్తి పోయడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదని ఫైరయ్యారు. అప్పుల పాలైన తెలంగాణలో మూసీ అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్ ప్రోగ్రాం ఏ విధంగా చేపడతారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చట్ట సభల్లో సంస్కారవంతంగా వ్యవహరించాలే తప్ప ఇష్టానుసారంగా కాదన్నారు. కేంద్ర నిధులు రాలేదని విమర్శలు తప్ప కేంద్రం ఇచ్చిన నిధులపై వివరాలు లేవని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై ఎదురు దాడికే ప్రాధాన్యత ఇచ్చిందే కానీ ప్రజా సమస్యలు ప్రస్తావించలేదని మండిపడ్డారు. మంత్రుల పని, మాట తీరు కూడా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి.. నిధులు లేవంటునే మరోవైపు అభివృద్ధి పనులు చేపడతానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర కేడర్ ను తెలంగాణలో కనబడనివ్వబోమని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు సగం మంది ఆంధ్ర అధికారులతోనే నింపేశారని కాటిపల్లి విమర్శలు చేశారు.
ముచ్చర్లను నాలుగో నగరంగా ప్రకటించడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని ఆయన ఫైరయ్యారు. జీహెచ్ఎంసీ ఆదాయం ఆ సంస్థకే చెందాలని నిర్ణయించడం సరికాదన్నారు. దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు దారుణమని, మంత్రులు చోద్యం చూశారే తప్ప ఎవరూ ఖండించలేదని వెంకటరమణా రెడ్డి విరుచుకుపడ్డారు. 80 వేల పుస్తకాలు చదివానని కేసీఆర్ చెబితే.. రేవంత్ రెడ్డి 80వేల అబద్ధాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీలో యాడ్స్ స్కామ్ జరుగుతోందని తెలిసి కూడా ఏ ఒక్కరూ నోరు మెదపలేదన్నారు. ఈ అవినీతి దాదాపు రూ.500 కోట్ల వరకూ ఉంటుందన్నారు. కాంగ్రెస్ లో ధ్వంసం, విధ్వంసం, అప్పులు, బూతు పురాణం తప్ప అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా సాగలేదని ఆయన చెప్పారు. అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన కవిత్వం వృధా ప్రయాస అంటూ చురకలంటించారు. వచ్చే సమావేశాల్లో ప్రజల పక్షాన ప్రతి నియోజకవర్గసభ్యుడు కృషి చేయాలని కాటిపల్లి సూచించారు.