- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా తెలుసు.. నేను నోరు విప్పితే ఇక అంతే: కేటీఆర్‌కు CM రమేష్ కౌంటర్!
దిశ, డైనమిక్ బ్యూరో: కేసుల భయంతోనే తాను బీజేపీలో చేరానని.. బీజేపీలో చేరడంతో తనపై ఉన్న అభియోగాలు అన్ని మాయం అయ్యాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. గతంలో కేసీఆర్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు కేటీఆర్ కూడా ఇవే కామెంట్స్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తండ్రి కొడుకులకు కళ్లు, చెవులు లేవని కేవలం నోరు మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. నా మీద ఒక్క సీబీఐ, ఈడీ కేసు లేదని.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేటీఆర్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ, మోడీ విధానాలు నచ్చే తాను కాషాయ తీర్థం పుచ్చుకున్నానని చెప్పారు.
తనపై పదే పదే అవే రకమైన విమర్శలు చేస్తున్నారని.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదని, మీ గురించి తనకు అంతా తెలుసన్నారు. బీజేపీలో చేరితే పాపాలన్ని కడిగిపోతాయన్న కామెంట్స్‌పై స్పందిస్తూ.. బీఆర్ఎస్ చేసింది ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నుంచి నేతలును బీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా? అని నిలదీశారు. మీ మీద ఉన్న అభియోగాల మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కోర్టుల మీద గౌరవం ఉంటే న్యాయపరంగా ఎదుర్కోవాలి అంతే కానీ ఇలా మీపై వచ్చిన ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.