- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ కంటే మన్మోహన్ సింగ్ బెటర్: సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ సర్కార్, ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై ఆదివారం సీఎం మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం అధ్వానంగా ఉందని విమర్శించారు. ఎప్పుడో చనిపోయిన మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీలను విమర్శిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోడీ కంటే మన్మోహన్ సింగ్ వందశాతం బెటర్ పరిపాలన అందించారని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని ఆరోపించారు. దేశంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన సరిగా లేదని బీజేపీ అవకాశం ఇస్తే.. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు అయిందని అన్నారు. ప్రధాని మోడీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగా లేరని అన్నారు. మొత్తం 192 దేశాల్లో మన దేశ ర్యాంక్ 139కి పడిపోయిందని ఎద్దేవా చేశారు.