- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోమాలోకి వెళ్తే బతకవు అని నిమ్స్ డాక్టర్లు నన్ను బెదిరించారు: CM KCR
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అవతరణ దశాబ్ది ముగింపు వేడుకల్లో సీఎం పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని అన్నారు. 1966లో ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిందని గుర్తుచేశారు. ఆ తర్వాత క్రమంగా ఈ ఉద్యమం యూనివర్సిటీలకు చేరిందని అన్నారు. ఉమ్మడి పాలకుల హయాంలో తెలంగాణ అనుభవించని బాధ లేదని తెలిపారు. ఆమోస్‌ను అప్పటి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టిందని గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు విద్యార్థులు ఎంతో గొప్పగా పనిచేశారని అన్నారు. పిడికెడు మందితో ఆనాడు ఐదారు వేల గంటలు మేధోమధనం చేసినట్లు తెలిపారు. నాడు అనేక మందిని సంప్రదించి వ్యూహంతో బయలుదేరినట్లు వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషి మరువలేనిదని తెలిపారు. ఆయన ఆజన్మ తెలంగాణ వాది అని అన్నారు. తెలంగాణ విషయంలో జయశంకర్ ఏనాడు వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం అనేకమంది ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలకు వెలకట్టలేదనిమని అన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు తెలిపారు. ఆనాడు నిమ్స్ డాక్టర్లు ఎంతో బెదిరించారని, కోమాలోకి వెళ్తే బతకవు అని సైతం హెచ్చరించారు. అయినా బెదరకుండా దీక్ష కొనసాగించినట్లు గుర్తుచేశారు. ఉద్యమసమయంలో ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని అన్నారు. తన మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరిమీదా జరగలేదని తెలిపారు. అనేక మంది ఎన్నో రకాలుగా విమర్శలు చేశారని, ఆ తిట్లే దీవెనలుగా భావించి ముందుకు సాగినట్లు వెల్లడించారు.
Also Read..
అమర వీరుల స్మారకంలోనూ బీఆర్ఎస్ అవినీతి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి