నెలాఖరులోపు రాష్ట్రంలో ఉండాలి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆర్డర్!

by GSrikanth |   ( Updated:2023-05-29 05:04:50.0  )
నెలాఖరులోపు రాష్ట్రంలో ఉండాలి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆర్డర్!
X

జూన్ రెండో తేదీ నుంచి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. దీంతో ప్రజాప్రతినిధులంతా స్థానికంగా ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఫారిన్ టూర్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఈ నెలాఖరులోపు రాష్ట్రానికి చేరుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. అలాగే దశాబ్ది వేడుకలు ముగిసే వరకు సెలవులు పెట్టొద్దని, ఆదివారాలు కూడా పని చేయాలని సీఎస్ నుంచి ఎంప్లాయీస్‌కు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఏటా వేసవి సెలవుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్స్ కు వెళ్తుంటారు. ఈసారి కూడా చాలా మంది లీడర్లు విదేశీ పర్యటనలకు ప్లాన్ చేసుకొని వెళ్లారు. అయితే ఫారిన్ టూర్ కు వెళ్లే ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఈసారి టూర్ కు వెళ్తున్న వారికి ముందుగానే కండీషన్ పెట్టారు. మే నెలాఖరులోపు రాష్ట్రానికి వచ్చేయాలని, జూన్ 2 నుంచి జరిగే దశాబ్ది వేడుకల్లో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. దీంతో చాలా మంది మంత్రులు మే రెండోవారంలోనే ఫారిన్ టూర్లను కంప్లీట్ చేసుకుని తిరిగివచ్చారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ తోపాటు కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విదేశీ పర్యటనలో ఉన్నారు. వారు కూడా మే నెలాఖరులోపు రాష్ట్రానికి చేరుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో వారు మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

వేడుకలు ముగిసేవరకు నో లీవ్స్

జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఏ రోజు ఏం చేయాలో ముందుగానే ప్రణాళికలు వేసుకున్నారు. ఆ షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలు నిర్వహించేందుకు డిపార్ట్ మెంట్స్ బిజీగా ఉన్నాయి. అయితే వేడుకలు ముగిసేవరకు ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దని, ఆదివారాల్లో కూడా పనిచేయాలని సీఎస్ ఆదేశించనట్టు తెలిసింది. దీంతో జూన్ ఫస్ట్ వీక్ లో సమ్మర్ ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్న ఎంప్లాయీస్ కు సమస్యగా మారింది. సెలవులు ఇచ్చేందుకు హెచ్ఓడీలు నిరాకరిస్తున్నట్టు చాలా మంది ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

Read more:

హాట్ న్యూస్: కేసీఆర్ వ్యూహానికి తగినట్లుగా ఎమ్మెల్యేల ప్రతివ్యూహం!....బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకుంటే ఏం చేయాలో ముందే ప్లాన్

Advertisement

Next Story

Most Viewed