బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన CM KCR

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-09 10:33:02.0  )
బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన CM KCR
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. కేసీఆర్ మొదట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూల మాల వేసి నివాళులర్పించారు. తర్వాత బీఆర్ఎస్ పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. వీరికి రాజ్యసభ ఎంపీ సంతోష్ స్వాగతం పలికారు. కళాకారులు డోలు వాయిద్యాలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ భవన్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారగా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం సాయంత్రం అధికారిక లేఖ సీఎం కేసీఆర్‌కు పంపారు. ఈసీ లేఖకు ఆమోదం తెలుపుతూ సీఎం సంతకం చేసి అధికారికంగా ఈసీకి పంపించనున్నారు. కాగా బీఆర్ఎస్ జెండా గులాబీ రంగులో ఉండగా జెండా మధ్యలో భారతదేశం గుర్తు ఉంది.






Advertisement

Next Story

Most Viewed