- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గులాబీ బాస్ మాస్టర్ స్కెచ్.. గెల్లుకు చైర్మన్ పదవి వెనుక భారీ వ్యూహం..?!
దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీలో అసంతృప్తులను బుజ్జగించే విషయంలో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారా? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల పంచాయతీలో తల నొప్పి లేకుండా వ్యూహం రచిస్తున్నారా? తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో పార్టీ క్యాడర్‌ను సమిష్టిగా చేసేందుకు ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలకు పిలుపునిచ్చిన గులాబీ బాస్.. తాజాగా తీసుకున్న మరో నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశం అవుతున్నది. తాజాగా తెలగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి నియమించారు. ఈ మేరకు సీఎం ఆదేశాలతో సీఎస్ ఉత్తర్వులను జారీ చేశారు.
కౌశిక్ కోసమే గెల్లుకు పదవి?:
అయితే ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బీఆర్ఎస్ పోటీకి నిలిపింది. బీసీ సామాజిక వర్గం, ఓయూ విద్యార్థి నేతగా గెల్లు శ్రీనివాస్‌ను ఓటర్లు ఆదరిస్తారని భావించినా ఫలితం మాత్రం చేదుగా వచ్చింది. ఈ ఎన్నిక సమయంలోనే అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్.
ఆ ఎన్నికల్లో ఫలితం అనుకూలంగా రాకపోయినా నియోజకవర్గంలో బీజేపీని నిలువరించేందుకు కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేసి పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా ఉండేలా అధినేత పక్కా వ్యూహం వేశారు. అయితే రాబోయే ఎన్నికల్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ తనదంటే తనదే అంటూ ఇటు కౌశిక్ రెడ్డి, అటు గెల్లు శ్రీనివాస్ బహిరంగ ప్రకటలు చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.
ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌తో పార్టీ ప్రయోజనాలకు డ్యామేజ్ తప్పదనే అభిప్రాయుల వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా గెల్లు శ్రీనివాస్‌కు స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టడం పార్టీలో చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డికి ఈ స్థానం నుంచి బరిలో దింపేందుకే గెల్లును సైడ్ ట్రాక్ చేయడమే తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటు కౌశిక్ రెడ్డికి రూట్ క్లియర్ చేయడంతో పాటు ఎన్నికల్లో ఓడిపోయినా గెల్లుకు చైర్మన్ పదవి ఇచ్చి ఆదరించామనే సింపతిని విద్యార్థి నేతల్లో మనో ధైర్యం నింపవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తున్నది. ఈ వాదనే నిజమైతే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఈటల మధ్య పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.