- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM కేసీఆర్ గిరిజనులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి: RS ప్రవీణ్ కుమార్ డిమాండ్
దిశ, డైనమిక్ బ్యూరో: గిరిజనులకు సీఎం కేసీఆర్ బేషరుతుగా క్షమాపణ చెప్పాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోడు సాగుపై తన బాధ్యతారాహిత్య, భూస్వామ్య వ్యాఖ్యలకు గిరిజనులందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ మంగళవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గిరిజన బిడ్డలను దురాక్రమణదారులన్న కేసీఆర్.. జోడేఘాట్ వద్దకు వచ్చి ముక్కు నేలకు రాయాలె అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంతటి అహంకారమా? ఆదివాసీలను ఇంతలా అవమానిస్తారా అంటూ ఆర్ఎస్పీ మండిపడ్డారు.
మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ ఉద్యమం చేపట్టింది. సీఎం దురహంకారపూరిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో గిరిజనుల గురించి మాట్లాడటం చాలా తేలిక అని.. వారిది ఆక్రమణ కాదు, దురాక్రమణ అంటూ ఫైర్ అయ్యారు. అడవి బిడ్డలు అయితే అడవి అంతా కొట్టేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా కనుమరుగవ్వాలా అంటూ మండిపడ్డారు. దీంతో, గిరిజనులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.