- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసలు తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సూర్యపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాధ సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలో కరెంట్ నీళ్లు లేవు, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. ఇప్పుడు తెలంగాణ గాడిన పడింది.. అదే మళ్లీ కాంగ్రెస్ వస్తే అంతే సంగతి అని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్ కూడా కాంగ్రెస్ హయంలోనే నాశనం అయ్యిందన్నారు. కాంగ్రెస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ధరణిని మార్చి భూ మాత పెడతాం, రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ అంటోంది.. కాంగ్రెస్ నేతలు కల్లిబొల్లి మాటలు నమ్మిమోసపోవద్దని సూచించారు. అసలు తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు.
రైతులకు మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు, 3 గంటల కరెంట్ ఇస్తే పొలానికి సరిపడా నీళ్లు పారుతాయా అని ప్రశ్నించారు. రైతులు బావి వద్ద 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలంటున్నారు.. తెలంగాణలో 30 లక్షల పంపుసెట్లు ఉన్నాయి, ఆ 30 లక్షల పంపులకు రూ.30 వేల కోట్లు కావాలి.. ఆ డబ్బులన్నీ ఎవరు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ప్రభుత్వం చేతిలో ఉన్న భూముల హక్కులను రైతుల చేతిలో పెట్టాం.. కాంగ్రెస్ నేతలేమో ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో సూర్యాపేటకు ఏళ్ల తరబడి మురికి నీళ్లు ఇచ్చారు, 30 లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, బీఆర్ఎస్ హయంలో దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ చేరుతుందన్నారు.