పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణలో కరెంట్ 3 గంటలే: సీఎం కేసీఆర్

by Satheesh |   ( Updated:2023-11-20 08:43:21.0  )
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణలో కరెంట్ 3 గంటలే: సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలి, ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమి లేవని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభా ఆశీర్వాధ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దివంగత సీఎం ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2 కిలోల బియ్యం ఇచ్చారు, అప్పుడు కాంగ్రెస్ పాలన బాగుంటే అసలు తెలుగు దేశం పార్టీ ఎందుకు పుట్టేదని అన్నారు.

ఇందిరమ్మ పాలన బాగుంటే ఉమ్మడి రాష్ట్రంలో వలసలు ఎందుకు ఉండేవని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలనలో నిత్యం రైతుల ఆత్మహత్యలు జరిగేవని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు మళ్లీ అలాంటి ఇందిరమ్మ పాలను తీసుకువస్తామంటున్నారని ఫైర్ అయ్యారు. ఒకనాడు తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెసని.. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. 3 గంటల కరెంటే వస్తుందన్నారు. ఓటు వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని.. ఆలోచించకుండా ఓటేస్తే మిమ్మల్నే కాటేస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed