- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.. సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో : కష్టంతో కూడుకున్న సుధీర్ఘమైన ప్రయాణమైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకోవడం ఖాయమని, ఈ క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలనే తాత్వికతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితమే నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. వర్ణం, కులం పేరుతో వివక్షను, అంటరానితనం అనే సామాజిక దురాచారాన్ని చిన్నతనం నుంచే ఎదుర్కొన్నారని, ఏనాడూ వెనకడుగు వేయని ధీరోదాత్తుడు అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలో నెలకొన్న అజ్ఞానాంధకారాలను చీల్చుకుంటూ జ్ఞానపు వెలుగులు విరజిమ్మిన ప్రపంచ మేధావి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగాఆయన సేవలను స్మరించుకున్నారు.ప్రజాస్వామ్యం, వర్ణ నిర్మూలన, అంటరానితనం, మతమార్పిడులు, స్త్రీల హక్కులు, మతం, ఆర్థిక సంస్కరణలు, చరిత్ర, ఆర్థికవ్యవస్థతో పాటు అనేక అంశాలపై చేసిన రచనలు, ప్రసంగాలు, విమర్శలు యావత్ ప్రపంచాన్ని ఆలోచింపచేశాయని అన్నారు.
అసమానతలు లేని, ఆధునిక భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు, సమస్త వ్యవస్థల్లో సమాన హక్కులకోసం తన జీవితకాలం పరితపించిన ఆదర్శమూర్తి అంబేద్కర్ అని కొనియాడారు. హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని ఆయన జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టించడం తెలంగాణకే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అన్నారు. అంబేద్కర్ ఆశయాల కొనసాగింపులో భాగంగా తెలంగాణ నూతన సచివాలయానికి ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం’ అనే పేరు పెట్టి అంబేద్కర్ ను సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు. దళితుల కోసం గురుకుల పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య, షెడ్యూల్డ్ కులాలు, తెగల ప్రత్యేక ప్రగతి నిధి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా రూ.20 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీలకు నైపుణ్య శిక్షణ, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, దళితులను ఎంటర్ ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో టీఎస్ ప్రైడ్, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ఎస్సీలకు 101 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు.
అన్ని వర్గాలకు అందుతున్న పథకాలతో పాటు, దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా, వారికోసం ప్రత్యేకంగా తెచ్చిన ‘తెలంగాణ దళితబంధు’ పథకం దేశ చరిత్రలోనే విప్లవాత్మక పథకంగా మారిందన్నారు. భవిష్యత్ లో వారు ఎంచుకున్న వ్యాపారంలో ఒడిదుడుకులు సంభవించి, ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా ఆదుకునేందుకు ‘రక్షణ నిధి’ ఏర్పాటు చేసి వారికి భరోసానందిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా ఆత్మన్యూనతతో అసంఘటితంగా వున్న ఎస్సీ కుల సమాజం..దళితబంధు పథకంతో సమిష్టిగా, సంఘటితమౌతూ, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని అన్నారు. వారి విజయాలతో తెలంగాణలోని దళిత సమాజం భారతదేశానికే ఆదర్శంగా నిలవబోతున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ స్ఫూర్తితో దేశంలో దళిత, సకల జనుల సంక్షేమానికి కృషి కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు.
Read more: