- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వార్తలు రాసే జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ రాయితీలు బంద్: KCR సంచలన వ్యాఖ్యలు (వీడియో)
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా సమస్యలపై, ప్రభుత్వంపై ప్రశ్నించే వార్తలు రాస్తే సహించబోమని సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ లాస్ట్ ఎడ్జ్‌లో ఉందని ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. కొన్ని పేపర్లు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయని.. వారికి మాత్రం ఇవ్వబోమని స్పష్టం చేశారు. మిగిలిన వారందరికీ ఇస్తామని వెల్లడించారు. న్యూట్రల్‌గా ఉన్నవారికి ఇస్తామని, ఎవరైతే రోజూ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్ముతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇవ్వబోమని ఇది ప్రభుత్వ నిర్ణయం అని పేర్కొన్నారు.
పొద్దున లేస్తే మాకు( ప్రభుత్వానికి) వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగించే శక్తులకు ఎందుకిస్తామని, ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. పాలుపోసి పామును పెంచలేం కదా? అని ప్రశ్నించారు. మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ఏం సంబంధం అని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఘాటుగా స్పందించారు. జర్నలిస్టులకు కూడా ఐడియా ఉండాలి కదా? కీలు బొమ్మలాగా ఉన్నవాడు జర్నలిస్టు ఎలా అవుతాడండి.. నోరు ఉండాలి కదా?.. సోయి ఉండాలి కదా? ఆమాత్రం జ్ఞానం, విజ్ఞానం ఉండాలి కదా?.. ఇండియాలో పోల్చుకోవడానికి మాతో ఏ రాష్ట్రమైన భయపడుతుందని, కానీ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు పడటం లేదు అని వార్తలు రాస్తున్నారు.. ఒక్కటే దెబ్బకు 20 వేల కోట్లు రుణ మాఫీ చేశాం.. ఆ పేపర్ ఈ రోజు ఎక్కడ తలకాయ పెట్టుకోవాలి ఇప్పడు.. అదో పేపరా? దానికో వాల్యూ ఉందా? ఏమనుకోవాలి.
అర్ధం ఉండాలి. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, తలసరి ఆదాయంలోనూ ముందంజలో ఉందని ఆర్బీఐ నివేదికలు ఇచ్చిందని, కేంద్ర మంత్రులు సైతం పార్లమెంట్‌లో తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడుతున్నారన్నారు. ఎవరికైన విజ్ఞత ఉన్నవారికి సిగ్గు అనిపిస్తది.. ఇదేంది దిక్కుమాలిన పని అని.. పొద్దున లేస్తే.. అని పత్రికలపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్యమ సమయంలోనే చెప్పానని.. రాష్ట్రంలో కొన్ని కులపత్రికలు ఉన్నాయి.. కొన్ని గులపత్రికలు ఉన్నాయన్నారు. న్యూస్ పేపర్లు ఉంటే ఫర్వాలేదు.. వ్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా... లూజ్ ఛానెళ్లు ఉంటే ఒకే.. న్యూస్ చానెళ్లు ఉండాలన్నారు.