- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్‌కు కామ్రేడ్ల టెన్షన్! పొత్తుపై నోరు విప్పడానికి జంకు!!
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంతో పొత్తు విషయంపై ప్రస్తుతం బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మక మౌనం దాల్చారు. అసలు వారితో పొత్తు ఉంటుందా? లేదా? అన్న విషయంపై కూడా క్లారిటీ లేదు. సీట్లపై ఇప్పుడే క్లారిటీ ఇస్తే కామ్రేడ్లు సైతం దూరమవుతారేమోనని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌తో అపాయింట్ మెంట్ కోసం సీపీఐ, సీపీఎం నేతల ఎదురు చేస్తూన్నారు. 2014, 2018లో ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. మునుగోడు బైపోల్‌లో మాత్రం కమ్యూనిస్టుల మద్దతు కోరింది. ఆ నియోజకవర్గంలో సీపీఎం, సీపీఐ గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండటంతో అనూహ్యం పొత్తులకు తెరలేపింది. అనంతరం రాబోయే ఎన్నికలకు సైతం బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటామని వామపక్షాల నేతలు ప్రకటించారు.
ఆ మూడు జిల్లాల్లోనే కమ్యూనిస్టుల బలం
వామపక్షాలు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో బలంగా ఉన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు. ఈ మూడు జిల్లాల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సైతం బలంగా ఉంది. అయితే అన్ని నియోజకవర్గాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పటిష్టమైంది. రాబోయే ఎన్నికల్లో తిరిగి గెలుస్తామని పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు సిట్టింగ్ లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ సర్వేల్లో సైతం వెల్లడైంది. దీంతో వామపక్షాల పొత్తుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే కొన్ని సిట్టింగ్ స్థానాలను వదులుకోవాల్సి వస్తుంది. కొత్తగూడెం, వైరా, పాలేరు, మధిర, భద్రాచలం, దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలను కేసీఆర్ ముందు ప్రపోజల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మధిర, భద్రాచలం మినహా.. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో సిట్టింగ్ స్థానాలను వదులుకొనేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా లేరని సమాచారం. ఖమ్మం జిల్లాల్లో మాజీ ఎంపీ పొంగులేటి ప్రభావం ఉంటుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జూపల్లి ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది. దీంతో వీరు ఏ పార్టీలో చేరబోతారనే విషయంపై క్లారిటీ వచ్చాక కమ్యూనిస్టులతో పొత్తు విషయం ఆలోచించే చాన్స్ ఉందని సమాచారం.
Read more: