- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బిగ్ న్యూస్: BRS ఎమ్మెల్యేలకు కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎన్నికలే టార్గెట్‌గా సీఎం KCR నయా ప్లాన్!
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఆగస్టు తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఆయన.. పార్టీ లీడర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మూడు నెలల్లోనే పనులన్నీ చక్కబెట్టాలని, సీరియస్‌గా వర్క్ చేసి మళ్లీ గెలిచేందుకు రెడీ అవ్వాలని ఇప్పటికే నేతలకు హింట్ ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్.. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసినట్టు టాక్. వాటిని పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించేందుకే ఎల్పీ, కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో వంద రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉన్నది. సెప్టెంబరు తర్వాత ఎప్పుడైన ఈసీ నుంచి ఎలక్షన్ ప్రకటన వచ్చే అవకాశముంది. దీంతో పార్టీ ఎమ్మెల్యేలను, లీడర్లను సీఎం కేసీఆర్ అలర్ట్ చేస్తున్నారు. ఈ వందరోజులు సీరియస్‌గా పనిచేయాలని, మళ్లీ గెలిచేందుకు రెడీ అవ్వాలని.. ఈ మధ్య ఆయనను కలిసిన పార్టీ లీడర్లకు కేసీఆర్ హింట్ ఇచ్చినట్టు సమాచారం. అందుకు పార్టీ, ప్రభుత్వ పరంగా ఏం చేయాలనే విషయాలను వివరించేందుకు కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తున్నట్టు టాక్.
ఆగస్టు తర్వాత ఎప్పుడైన..
ఎన్నికల షెడ్యూల్‌ను ఆగస్టు తర్వాత ఎప్పుడైన ఎన్నికల కమిషన్ ప్రకటించే చాన్స్ ఉన్నది. ఈ ఏడాది డిసెంబరు 17లోపు మిజోరం అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం కొలువుతీరాలి. వీటితో పాటే ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించేందు ఈసీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. వీటన్నింటికీ ఆగస్టు తర్వాత షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశముంది.
ఏం చేసినా ఈ వందరోజల్లోనే
ఎన్నికల షెడ్యూలు విడుదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో రూలింగ్ పార్టీకి విధాన పరమైన నిర్ణయం తీసుకునే చాన్స్ ఉండదు. దీంతో ఈ మూడు నెలల్లో అన్ని పనులు పూర్తి చేయాలని, పెండింగ్ పనులు కంప్లీట్ చేసుకోవాలని, లోటుపాట్లను సరిదిద్దుకోవాలి, ప్రభుత్వం పట్ల నెగిటివ్ ఉన్న వర్గాలకు దగ్గరకావాలని సీఎం కేసీఆర్ పార్టీ లీడర్లకు హింట్ ఇచ్చినట్టు సమాచారం.
ఇందుకోసం అవసరమైన షెడ్యూలును కూడా సీఎం కేసీఆరే స్వయంగా రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిని ప్రతి ఎమ్మెల్యేకూ అర్థమయ్యేతీరుగా వివరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసమే మంత్రులు, ఎమ్మెల్యేలకు వివరించేందుకు పార్టీ ఎల్పీ, కేబినెట్ మీటింగులను వరసగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది.
జూన్ 2 నుంచి ప్రజల్లోకి..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) నుంచి ఎన్నికల ప్రచారానికి నాంది పలికాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రాష్ట ఏర్పాటు దశాబ్ది వేడుకలను మూడు వారాల పాటు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేడుకలు ముగిసిన తర్వాత అదే ఊపుతో ప్రజల్లో విస్తృతంగా పర్యటించాలని ప్లాన్ చేస్తున్నది.
ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులను నేరుగా కలిసేందుకు కసరత్తు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రతి గ్రామంలో ఏయే స్కీం కింద ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారో అధికారులు లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. వారిని నేతలు నేరుగా కలిసి మళ్లీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు.