- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ ఫైల్ పైనే: సీఎం కేసీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్ అధికారలోకి వస్తే.. తొలి మంత్రి వర్గ సమావేశంలో అసైన్డ్ భూముల పట్టాలపై సంతకం చేస్తానని గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా రైతు బంధు రూ. 16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సంగారెడ్డి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు.
1956 లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, అప్పుడు రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపటం వల్ల 50 ఏళ్లు ఎన్నో గోసలు పడ్డామని గుర్తుచేశారు. గులాబీ జెండా పట్టి అందరం పోరాడితే 2004లో తెలంగాణ ప్రకటించారని, అప్పుడు ప్రకటించినా తెలంగాణను 2014 వరకు ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నాకనే కాంగ్రెస్ పార్టీ దిగివచ్చిందని గుర్తుచేశారు. మరోవైపు ధరణి పోర్టల్‌లో రైతుల వేలిముద్ర లేకుండా భూ రికార్డులను సీఎం కూడా మార్చలేరని, ధరణితో రైతుల భూములు నిశ్చింతగా ఉన్నాయని చెప్పారు.