- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో కేంద్ర ప్రభుత్వం అరాచకాలు, ఆగడాలు మితిమీరిపోయాయని సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం పని చేయనీయకుండా అడ్డుపడుతోందని ధ్వజమెత్తారు. శనివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో భేటీ అనంతరం వారితో కలిసి సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అప్పట్లో బీజేపీ నాయకులు, ఇప్పుడు మోడీ, అమిత్ షా మాట్లాడుతున్నారు. కానీ అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అదే ఎమర్జెన్సీని తలపించే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ లాంటి మహమహా నాయకులను తప్పు చేస్తే ఈ దేశం గిల్లిపారేసిందని మిమ్మల్ని కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్రం ముప్పుతిప్పలు పెడుతోందని.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయంలోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందన్నారు. బీజేపీ పాలనలో సుప్రీంకోర్టు తీర్పుకు అతీగతీ లేకుండా పోయిందన్నారు. ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో తీసుకువస్తే పార్లమెంట్‌లో మా శక్తిని ప్రయోగించి అడ్డుకుంటామన్నారు.
సాగు చట్టాలను ఉపసంహరించుకున్నట్లుగానే ఈ ఆర్డినెన్స్ కు కూడా విత్ డ్రా చేసుకోవాలని ఈ విషయంలో భేషజాలకు పోవద్దన్నారు. కేజ్రీవాల్ సర్కార్‌పై కేంద్రం అనుసరిస్తున్న తీరు మీకు, దేశానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలా ఉందన్నారు. నిన్నగాక మొన్ననే కర్ణాటకలో ప్రజలు బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారని ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.
Read more: