కీలక మీటింగ్‌కు సీఎం కేసీఆర్ ఆలస్యం!

by GSrikanth |
కీలక మీటింగ్‌కు సీఎం కేసీఆర్ ఆలస్యం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఓ వైపు ఎన్నికల సంవత్సరం, మరో వైపు కవితను దర్యాప్తు సంస్థలు విచారిస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలస్యంగా రావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని తప్పకుండా హాజరుకావాలని పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్ పార్టీ సహా రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, జెడ్పీ చైర్​పర్సన్లు, స్టేట్ లెవల్ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్​ చైర్​పర్సన్లకు పార్టీ పెద్దల నుంచి ఆహ్వానం అందింది.

అయితే, ఈ మీటింగ్‌కు సీఎం కేసీఆరే ఆలస్యంగా రావడం చర్చగా మారింది. మధ్యాహ్నం 3:16 గంటలకు గులాబీ బాస్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. పార్టీ కార్యచరణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రచార సరళి, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనే విషయంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed