- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంతో తాడో పేడో.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ షురూ
దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్ ముగిసేదాకా రైతుల సమస్యలపైనే టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఎలా అనుసరించాలనే దానిపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేసేలా యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నారు. కాంగ్రెస్ , బీజేపీలకు ధీటుగా కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహాసంగ్రామయాత్రను చేపట్టగా.. రెండో విడుత యాత్రను ఏప్రిల్ 14 నుంచి చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మనఊరు మనపోరుతో ప్రజల మధ్యకు వెళ్లారు. వాటికి ధీటుగా వెళ్లేందుకు గులాబీ బాస్ కార్యచరణను సోమవారం ప్రకటించనున్నట్లు తెలిసింది.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని, దానికి ధాన్యం కొనుగోళ్లపై అవలంభిస్తున్న వైఖరే నిదర్శమని పేర్కొంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యచరణను టీఆర్ఎస్ రూపొందించింది. తెలంగాణ తరహా ఉద్యమంతోనే ధాన్యం కొనుగోళ్లు సాధ్యమని, అందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. పంజాబ్ తరహా పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలంటే ఉద్యమం ఒక్కటే మార్గమని భావిస్తుంది. అయితే ఏప్రిల్ మొదటి వారం నుంచి వరికోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతు సమస్యలే ఎజెండాగా కార్యచరణను చేపట్టనుంది. యాసంగి కొనుగోళ్లు ముగిసేవరకు టీఆర్ఎస్ రైతుల పక్షాన ఉండి పోరాటం చేయడంతో పాటు కేంద్రం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ నిరసనలు, ధర్నాలు, వినతులు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తిప్పికొట్టడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు సాగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని, ఇక ప్రజల్లోకి వెళ్లడమే తరువాయి అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
గులాబీ బాస్ గైడెన్స్ పైనే దృష్టంతా..
రాష్ట్రంలో పండిన ధాన్యమంతా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని సీఎం కేసీఆర్ గత ఏడేళ్లుగా సభలు, సమావేశాలు, మీడియా వేదికగా పేర్కొంటున్నారు. అయితే కేంద్రం బాయిల్డు రైస్ కొనబోమని చెప్పడంతో ఒక్కసారిగా డైలామాలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. రైతుల నుంచి వ్యతిరేక వస్తుంది. దీనికి తోడు బీజేపీ, కాంగ్రెస్ లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తిని పోగొట్టేందుకు టీఆర్ఎస్ రైతుల పక్షం అని చెబుతూనే కేంద్రంపై పోరు చేసేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు గులాబీ బాస్. అందులో భాగంగానే పార్లమెంట్ లో టీఆర్ఎస్ నిరసనలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సన్నద్ధమవుతుంది. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వరకు పార్టీ శ్రేణులకు కార్యచరణను ఇవ్వనున్నట్లు సమాచారం. అవసరం అయితే విభజన సమస్యల్లోని ప్రధాన అంశాలు నిధులు, ఐటీఐఆర్, రైల్వే కోచ్,ఆదిలాబాద్ సిమెంట్ కంపెనీ, బొగ్గుగనుల వేలం ఇలా ప్రతి అంశంపై నిరసన కార్యక్రమాలకు సైతం పిలుపు ఇచ్చే అవకాశం ఉందని, కేంద్రం తీరును ఎండగట్టమే లక్ష్యంగా ప్రజల్లోని వ్యతిరేకతను తగ్గించి టీఆర్ఎస్ పై సానుకూల పవనాలు వచ్చేలా కార్యచరణను చేపట్టనున్నట్లు తెలిసింది.
నేడు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం...
తెలంగాణ భవన్ లో శాసనసభాపక్ష సమావేశం సోమవారం ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, జిల్లా అధ్యక్షులు ,జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నారు. వారికి పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ కార్యచరణను వివరింనున్నారు.