మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 100 బస్సులు

by Prasad Jukanti |
మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరో 100 బస్సులు
X

దిశ, డైనమిక్ బ్యూరో:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన నేపథ్యంలో కొత్తగా అదనపు బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవాళ 100 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మరో వెయ్యి బస్సులు కొంటామని చెప్పారు. మహాలక్ష్మి పథకం నిధులను ప్రతినెలా ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఈ ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీని క్షేత్రస్థాయిలో తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేశారు. ఆందోళన సమయంలో 36 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. కానీ సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మికుల సంఘాలను నాటి సీఎం కేసీఆర్ రద్దు చేశారన్నారు.

Advertisement

Next Story

Most Viewed