- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీడిన సస్పెన్స్.. కాషాయ గూటికి చేరిన ఇద్దరు మాజీ మంత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఎట్టకేలకు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి ఆయన గత నెలలోనే పార్టీలో చేరాల్సి ఉంది. అందుకోసం ఆయన నగరంలో భారీగా ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనూహ్య పరిణామాల నడుమ ఆయన చేరిక ఆగిపోయింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చేరిక నిలిచిపోయిందని స్వయంగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తెలిపారు. దాదాపు నెలరోజుల తర్వాత ఆయన చేరికపై నెలకొన్న సస్పెన్స్ తొలగింది. ఇదిలా ఉండగా కృష్ణ యాదవ్ తన అనుచరులతో కాషాయతీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, సిర్పూర్ కాగజ్ నగర్ జెడ్పీటీసీ రేఖ సత్యనారాయణ, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలు తదితరులు పార్టీలో చేరారు. కాగా వారికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే చికోటి చేరిక విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు. ఆయన కూడా కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. భారీ ర్యాలీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన చేరిక నిలిచిపోయింది. కాగా చికోటి ప్రవీణ్ చేరికపై రాష్ట్ర బీజేపీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆయన్ను చేర్చుకుంటారా? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.