- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్‌గా చిన్నారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డికి కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చిన్నారెడ్డికి కేబినెట్ ర్యాంగ్ హోదా కల్పించింది. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నారెడ్డి సీటు త్యాగం చేశారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మేఘారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డిపై గెలుపొందారు.
గతంలో చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో, 2004లో, 2014 ఎన్నికల్లో చిన్నారెడ్డి గెలుపొందారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.