- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం పార్టీ పెద్దలతో వరుసగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ హైకమాండ్ అనుమతితోనే ముఖ్య నిర్ణయాల అమలు జరుగుతోంది.
ఈ క్రమంలో భాగంగా మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ పూర్తి చేసేలా సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పదవుల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా ఓ క్లారిటీ రానున్నది. ఇప్పటికే పార్టీ 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించింది కాంగ్రెస్ సర్కార్. మరో ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయనుంది.