టాలీవుడ్ పెద్దలపై CM రేవంత్ రెడ్డి సీరియస్.. స్పందించిన చిరంజీవి

by Gantepaka Srikanth |   ( Updated:2024-07-30 13:41:46.0  )
టాలీవుడ్ పెద్దలపై CM రేవంత్ రెడ్డి సీరియస్.. స్పందించిన చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర ప్రముఖులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నంది అవార్డులను గద్దర్ పేరుతో భర్తీకి తీసుకున్న నిర్ణయంపై అభిప్రాయాలు, సూచనలు చేయాలని కోరగా.. ఒక్కరు కూడా స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి స్పందించి.. సీఎం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలించాంబర్, నిర్మాతల మండలిని కోరారు. మంగళవారం సి.నారాయణ రెడ్డి జయంతి వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ గద్దర్ అవార్డుల అంశంపై మాట్లాడారు. తాజాగా.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. సీఎం అపాయింట్మెంట్ కోసం తాము చాలా ప్రయత్నం చేశాము. సీఎం చెప్తే తాము చేయకుండా ఉండబోము. గద్దర్ పేరు మీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి ఎవరిని వెళ్లి కలవమన్నా కలుస్తాం. సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వస్తే తప్పకుండా వెళ్లి కలుస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed