- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక రాష్ట్రంలో కరెంట్ పోకూడదు.. అధికారులకు CM రేవంత్ వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ శాఖ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో కరెంట్ కట్ చేస్తే ఏకంగా సస్పెండ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్దేశ పూర్వకంగా కరెంట్ కట్ చేసి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూస్తే ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. అవసరాలకు సరిపడేంత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పెరిగిందని అన్నారు. ఈ క్రమంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా విద్యుత్ కోతలకు పాల్పడితే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.