- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth: మందా జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు(Nagarkurnool) మాజీ ఎంపీ మందా జగన్నాథం(Manda Jagannadham) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ సభ్యుడిగా, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడిగా జగన్నాథం కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి కొనియాడారు. జగన్నాథం మరణం తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. కాగా, నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచిన జగన్నాథం గత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్పీ పార్టీలో చేరారు. మూడుసార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు.
Next Story