రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

by GSrikanth |
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం యాదాద్రికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు లక్ష్మినరసింహా స్వామిని దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయ ప్రవేశం విషయంలో అక్టోబర్ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో ప్రత్యేక పూజలు, కీలక ప్రకటన ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో సీఎం యాదాద్రి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. జాతీయ పార్టీ ప్రకటనకు ముందే కేసీఆర్ సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని సైతం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దసరా పండగ రోజున ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. నేషనల్ పాలిటిక్స్‌పై ఆయన ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే ఉత్కంఠ ఇటు టీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్రంలోని మిగతా రాజకీయ పక్షాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story