మన పథకాలను పక్క రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.. CM KCR

by Javid Pasha |   ( Updated:2023-06-09 14:06:37.0  )
CM KCR Likely to Visit Bihar On August 13
X

దిశ ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అనేక పొరుగు రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తో పాటు జిల్లా సమీకృత అధికారుల కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని కొత్త మెడికల్ కళాశాలలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన అనంతరం అధికారులతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మారుమూల గ్రామాలతో పాటు అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా ఏర్పాటు అయిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదనలోనే ఉందని తమ ప్రభుత్వం మాత్రమే సుసాధ్యం చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్ ఢిల్లీ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయని చెప్పారు.

వరి సాగులో తెలంగాణ పంజాబ్ రాష్ట్రాన్ని మించిపోయిందని రెండేళ్లలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం కులమతాలకు అతీతంగా పనిచేస్తుందని అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేయడం వల్లనే సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని చెప్పారు. గొర్రెల పంపిణీ పథకంలో తెలంగాణ ఆదర్శవంత రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యేలు దివాకర్ రావు చిన్నయ్య కలెక్టర్ సంతోష్ బడావట్ పాల్గొన్నారు.

Read more:

బడ్జెట్​లేక మూలనపడ్డ సంక్షేమం.. దళితబంధు ఎంపికలో అంతా దగే!

CM KCR: ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.. మంచిర్యాల పర్యటనలో సీఎం కేసీఆర్

కేసీఆర్‌ను నమ్మని విపక్ష నేతలు? తేదీ మారినా అందని ఆహ్వానం

Advertisement

Next Story