- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఎవరు ఇయ్యలే.. చావు నోట్ల తలపెట్టి సాధించినం: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ మహబూబ్ నగర్ బ్యూరో/జడ్చర్ల, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పొరపాటున అధికారం ఇస్తే 24 గంటల కరెంటుకు రామ్ రామ్.. దళిత బంధుకు జై భీమ్ పలకడం ఖాయం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలలో భాగంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగించారు. 1956లో జరిగిన చిన్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల 60 ఏళ్లు గోసవడ్డం.. ఎక్కడ చూసినా కరువు కాటకాలు.. వలసలు.. కన్నీళ్లు తప్ప మరి ఏమీ ఉండేవి కావు అని చెప్పారు.
పాలమూరు జిల్లాలో అంబలి, గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కన్నీళ్లు వచ్చినయ్.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేను కలిసి ఈ జిల్లాలో తిరిగినప్పుడు ఈ ప్రాంత ప్రజలే కాదు.. అడవులలో ఉన్న చెట్లు కూడా బక్క చిక్కిపోయాయి కదా అని ఆవేదన చెందినట్లుగా ముఖ్యమంత్రి చెప్పారు. పక్కన కృష్ణమ్మ ఉన్న సాగునీరు కాదు కదా.. తాగునీరు కూడా తెచ్చుకోలేని దిస్థితి .. ఎంతోమంది త్యాగాలు.. పోరాటాలు.. చేయడం వల్ల తెలంగాణ తెచ్చుకున్నాం.. ఎవరు ఉట్టిగా ఇవ్వలేదు.. మీ పాలమూరు జిల్లా ఎంపీగా తెలంగాణను తెచ్చుకున్నాం.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే ఈ ప్రాంత దరిద్రులు కొందరు బెత్తెడున్న జూరాల నుండి సాగునీటిని తీసుకోవచ్చు కదా అంటారు.
రోజు రెండు టీఎంసీల చొప్పున నీళ్లను తీసుకుంటే 9 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాల ఖాళీ అవుతుంది అన్న విషయం కూడా తెలియదు.. పైగా ఎన్నో కేసులు వేశారు. ఇప్పుడిప్పుడే ఆ కేసులని కొలిక్కి వస్తున్నాయి. పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే లక్ష్మీ అమ్మవారు తాండవిస్తున్నట్లుగా మారుతుంది అని తెలిపారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే కరెంటును కాట్ల కలుపుతారు. 24 గంటలు కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం మనదే. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలోనూ కరెంటు సక్రమంగా లేక రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రైతుబంధుకు రామ్ రామ్ .. దళిత బందుకు జై భీమ్ పలుకుతారు.. రాబోయే రోజులలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న జడ్చర్లను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలంగాణ కోసం నాతోపాటు పదవికి రాజీనామా చేశారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు అన్ని విధాల సహకరించాడు.. మళ్లీ ఆయనను గెలిపించుకుంటే జడ్చర్ల నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్‌లు స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.