నియామకం తర్వాత తొలిసారి బీజేపీ ఆఫీసుకు చంద్రశేఖర్

by GSrikanth |
నియామకం తర్వాత తొలిసారి బీజేపీ ఆఫీసుకు చంద్రశేఖర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా జాతీయ నాయకత్వం చంద్రశేఖర్ తివారీని ఇటీవల నియమించింది. కాగా ఆయన తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి శనివారం వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను అధిష్టానం నియమించింది. కాగా ఈ ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఆయన తెలంగాణలోనే మకాం వేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన బలాలు, బలహీనతలపై దృష్టి సారించి హైకమాండ్‌కు నివేదికలు పంపించనున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల వ్యూహాలను అధిష్టానం రచించనుంది. ఆపై నాయకులకు దిశానిర్దేశం చేయనుంది.

Advertisement

Next Story