కాసేపట్లో కేసీఆర్‌ను పరామర్శించనున్న చంద్రబాబు

by GSrikanth |
కాసేపట్లో కేసీఆర్‌ను పరామర్శించనున్న చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆసుపత్రికి వచ్చి కేసీఆర్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసీఆర్‌ను పరామర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన యశోద ఆసుపత్రికి రానున్నారు.

కాగా, గతంలో చంద్రబాబు హయాంలో కేసీఆర్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అనంతరం టీడీపీని వీడి టీఆర్ఎస్‌ను కేసీఆర్ స్థాపించారు. రాష్ట్ర విభజన అనంతరం కేసీఆర్ తెలంగాణకు, చంద్రబాబు ఏపీకి తొలి ముఖ్యమంత్రులుగా పని చేశారు. అనంతరం వీరిద్ధరి మధ్య రాజకీయంగా దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వద్దకు చంద్రబాబు రాబోతుండటం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story

Most Viewed