Chandrababu కు ఘన స్వాగతం.. భారీ వాహన ర్యాలీతో ఖమ్మం సభకు..

by Mahesh |   ( Updated:2022-12-21 07:13:08.0  )
Chandrababu కు ఘన స్వాగతం.. భారీ వాహన ర్యాలీతో ఖమ్మం సభకు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ శ్రేణులు బుధవారం ఘనస్వాగతం పలికారు. సాయంత్రం ఖమ్మంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షతన తొలి సభ నిర్వహిస్తుండగా ఆ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు బయలుదేరారు. మార్గమధ్యంలో మెట్టు గూడలో టీడీపీ నేతలు స్వాగతం పలికారు. రసూల్ పురాలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉప్పల్ రింగ్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్‌లలో టీడీపీ శ్రేణులు బాబుకు ఘన స్వాగతం పలికారు. గ్రేటర్ హైదరాబాదులోని సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి బాబుకు స్వాగతం పలికారు. గ్రేట్ హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో రోడ్లు పసుపు మయంగా మారాయి. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Also Read....

రూటు మార్చిన Chandrababu.. ఇక తెలంగాణపైనే ఫోకసా?

Advertisement

Next Story

Most Viewed