Chamala: తోకముడిచినవా ఎక్స్ రాముడు..? కేటీఆర్ పై ఎంపీ చామల సంచలన విమర్శలు

by Ramesh Goud |   ( Updated:2025-01-13 13:42:56.0  )
Chamala: తోకముడిచినవా ఎక్స్ రాముడు..? కేటీఆర్ పై ఎంపీ చామల సంచలన విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: తోక ముడిచిన కేటీఆర్.. దొంగ దీక్ష రద్దు అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) విమర్శించారు. నల్లగొండ(Nalgonda)లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా(BRS Raithu Maha Darna) వాయిదాపై ట్విట్టర్ వేదికగా స్పందించిన చామల.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. డాడీ మందలింపుతో తోకముడిచినవా X రాముడు? అని కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. అలాగే ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమ నిర్ణయాలతో తెలంగాణ పల్లెల్లో పండుగ వాతావరణం కనిపిస్తుందని, చరిత్రలో తొలిసారిగా రూ.2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌తో రైతన్నలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా, భూమి లేని పేదలకు రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల ప్రకటనలతో ఆనందంగా ఉన్నారని చెప్పారు.

అంతేగాక గ్రామీణ తెలంగాణ ఓటర్లు అత్యంత సంతోషంగా ఉన్నట్లు మీ డాడీ చేయించుకున్న సర్వేతోని తెలిసింది.. దెబ్బకు మీ డాడీ దిమ్మతిరిగిపోయిందని కేసీఆర్(KCR) ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఊర్లల్ల జనాలు ఇంత సంతోషంగా ఉన్నప్పుడు రైతు మహా ధర్నా పేరుతో డ్రామాలు చేస్తే.. జనం ఛీకొడ్తరని మీ డాడీ అర్థం చేసుకుండని, రుణమాఫీతో అప్పులు తీరి, బోనస్‌తో అదనపు ఆదాయం పొందుతున్న రైతులు మన దొంగ దీక్షకు ఎందుకు వస్తారంటూ నిన్ను అర్సుకుండు అని చెప్పారు. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రకటించిన ప్రజాప్రభుత్వం పట్ల సంతోషంగా ఉన్నోళ్లు మన మొఖం ఎందుకు చూస్తరని నీ దుమ్ము దులిపిండంట కదా అని ఎంపీ అన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా రైతు దీక్ష చేద్దామని ఎలా అనుకున్నావంటూ గట్టిగానే మందలించిండంట కదా డ్రామారావా? అని ఎద్దేవా చేశారు. డాడీ మాటలకి బిక్కమొఖం వేసుకోని.. నల్లగొండ రైతు మహా ధర్నాను రద్దు చేసుకున్నవ్ అని, మీదికెళ్లి సంక్రాంతి పండుగ పేరుతో కవర్ చేసుకున్నవ్ అని ఆరోపించారు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా.. అన్నదాతలకు ప్రజాప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని తగ్గించలేరు అని చామల రాసుకొచ్చారు.

Next Story

Most Viewed