- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chamala: గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిపై తెలంగాణలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
దిశ; తెలంగాణ బ్యూరో: గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిపై కేసు నమోదు చేయాలని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నాడని, కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. గుజరాత్ బీజేపీ ట్విట్టర్ ప్లాట్ ఫామ్ లో ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. నల్లధనం నుంచి వాటా సేకరిస్తున్నట్లు కరెన్సీ నోట్లతో కలిగిన మార్ఫింగ్ చిత్రాన్ని బీజేపీ తన ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ లో పోస్టు చేసిందని, ఇది రాహుల్ గాంధీ వ్యక్తిగత ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నదని ఫైర్ అయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుతం లోక్ సభ, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తిపై ఇలాంటి తప్పుడు ప్రచరాలు సరికాదని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా పరిగణిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.