ఈ-మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. 'చాలెంజ్ గ్రాండ్ ఫినాలే'

by Vinod kumar |
ఈ-మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. చాలెంజ్ గ్రాండ్ ఫినాలే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ-మొబిలిటీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్‌ను ఫిబ్రవరి 5 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. మంగళవారం ఈ మొబిలిటీ వీక్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెళ్లడించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో ఆవిష్కరణలను వేగవంతం చేసే లక్ష్యంతో.. మొబిలిటీలో వినూత్నమైన ఆచరణీయమైన, స్కేలబుల్ సొల్యూషన్‌లను ప్రదర్శించడానికి భారతీయ స్టార్టప్ లను ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం కనెక్టెడ్, అటానమస్, షేర్డ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ ఛాలెంజ్‌ను నిర్వహిస్తుందన్నారు.

ఛాలెంజ్ యొక్క గ్రాండ్ ఫినాలేను ఫిబ్రవరి 7 నిర్వహిస్తున్నామన్నారు. విజేతకు రూ.10 లక్షల వరకు గ్రాంట్లు అందించబడుతాయన్నారు. రన్నర్స్‌కు రూ. 5లక్షలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 100కు పైగా స్టార్టప్ లు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అపోలో టైర్స్ లిమిటెడ్ ఆసియా, మిడిల్ ఈస్ట్ ఆప్రికా ప్రెసిడెంట్ సతీష్ శర్మ, టీవీఎస్ మోటార్ కంపెనీ చీఫ్ డిజిటల్ ఏఐ ఆఫీసర్ మహేశ్వరన్ కాలవై తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed