ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తుచేసిన Chada Venkat Reddy

by GSrikanth |   ( Updated:2023-08-30 14:33:59.0  )
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని గుర్తుచేసిన Chada Venkat Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెండవ ఏఎన్‌ఎమ్‌ల ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. చట్టబద్ధంగా సమ్మె చేస్తున్న వారికి.. షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం ఉపసంహరించుకొని చర్చలకు ఆహ్వానించి డిమాండ్స్‌ పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీంను దాదాపు ఐదున్నర వేల మంది రెండవ ఏఎన్‌ఎమ్‌లు గత 16 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరిని డిస్ట్రిక్‌ సెలెక్షన్‌ కమిటీ (డీఎస్‌సీ) ద్వారా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, రోష్టర్‌, మెరిట్‌ ఆధారంగా చేసుకొని ఎన్నిక చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందినందరిని క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

అనంతరం డిపార్టుమెంట్లలో ఉన్నటువంటి కొర్రీలను ఆధారంగా చేసుకొని కొద్ధిమందిని మాత్రమే క్రమబద్ధీకరించి మిగతా సిబ్బందిని క్రమబద్దీకరించకపోవడం అన్యాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో రెండవ ఏఎన్‌ఎమ్‌లను డిపార్టుమెంటల్‌ ఎగ్జామ్‌ ద్వారా క్రమబద్దీకరించిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి సమ్మె నోటీసు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు అడిగినా సమస్య పరిష్కారం కానందున చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నటువంటి రెండవ ఏఎన్‌ఎమ్‌లకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం అక్రమమన్నారు. కార్మిక హక్కులను హరించడమే అవుతుందని తెలిపారు. రెండవ ఏఎన్‌ఎమ్‌లందరి ఉద్యోగాలను క్రమబద్దీకరించి, షోకాజ్‌ నోటీసులు ఉపసంహరించుకొని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story