వేములవాడ రాజకీయాల్లో 'CESS' కలకలం

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-05 06:56:18.0  )
వేములవాడ రాజకీయాల్లో CESS కలకలం
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతంలో ఏనుగు మనోహర్ రెడ్డికి రాజకీయంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌లో టాప్ లీడర్‌గా గుర్తింపు పొందిన ఏనుగు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో పార్టీని వీడీ కీలక సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు మద్దతు పలికారు. కానీ టీఆర్ఎస్‌లో రాజకీయ జీవితం మారుతుందని అనుకున్న ఏనుగు మనోహర్ రెడ్డికి నిరాశే మిగిలింది. నాలుగేళ్లుగా నామినేట్ పోస్టు రాకపోగా.. సెస్ ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ పదవి దక్కించుకుందామని అనుకున్నా పరిస్థితులు అనుకూలించడం లేదు.

వేములవాడ రాజకీయాల్లో ఏనుగు మనోహర్ రెడ్డికి అంతగా అదృష్టం కలిసిరావడం లేదన్న చర్చ కొనసాగుతోంది. రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది. కావాలనే ఎనుగు మనోహర్ రెడ్డిని రాజకీయంగా ఎదగనివ్వడం లేదన్న అపవాదు టీఆర్ఎస్‌పై నెలకొంది. సిరిసిల్ల సెస్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకొని వేములవాడ రూరల్ ప్రాంతం నుంచి పోటీలో ఉందామనుకున్న ఏనుగు మనోహర్ రెడ్డికి ఈ పదవి కూడా దక్కదని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబు పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. వేములవాడ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఆ రోజు మనం మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి తెచ్చుకున్నామన్నారు.

ఈ సెస్ చైర్మన్ పదవి వేములవాడకు అంత ఈజీగా రాదని, వస్తే గిస్తే.. వైస్ చైర్మన్ పోస్టు వస్తుందన్నారు. చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకుంటరు.. కానీ అన్నీ సాధ్యం కావని నేతల్లో చర్చ కొనసాగుతుంది. దీంతో ఏనుగు మనోహర్ రెడ్డికి ఈ సెస్ చైర్మన్ పదవి కూడా కష్టమేనని..ఎమ్మెల్యే వాఖ్యల్లో పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లు .. రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఈ విషయం కాస్తా సిరిసిల్ల టీఆర్ఎస్ లీడర్లకు తెలియడంతో సెస్ చైర్మన్ పోస్టు కోసం పోటీ పడుతున్నారు. డిసెంబర్ 5న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో వేములవాడకు చెందిన ఏనుగు మనోహర్ రెడ్డి రాజకీయ జీవితం మరోసారి చర్చనీయంశమవుతుంది. తాను మాత్రం వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ బాబును, మంత్రి కేటీఆర్‌ను నమ్ముకున్నానని తప్పక తనకు న్యాయం చేస్తారని మనోహర్ రెడ్డి తన అభిమానుల వద్ద చెప్పుకుంటున్నట్లు తెలిసింది. సిరిసిల్ల సెస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో కానీ .. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ముఖ్య నేతలందరు ఈ పదవిపైనే ఆశలుపెట్టుకోవడం, రమేష్ బాబు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం చర్చనీంశమైంది.


Read More.......

పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి: Minister Harish Rao

Advertisement

Next Story